ALL >> Entertainment >> View Article
2023 Top Telugu Web Series : దుమ్మురేపిన టాప్ 5 వెబ్ సిరీస్ లు ఇవే
Top Telugu Web Series(Today tollywood news in telugu)
2023 మన జీవితం నుంచి వెళ్లిపోవడానికి కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఈ ఏడాది మొత్తం జరిగిన ఆసక్తికరమైన సంఘటనలను, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇంకా వెబ్ సిరీస్ ల గురించి మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది గతంలో కంటే ఒరిజినల్ తెలుగు సిరీస్ ల సందడి ఎక్కువయింది. ఇక 2023లో టాప్ లేపేసిన సిరీస్ లు బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ ఏడాది ...
... తెలుగులో దుమ్మురేపిన వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధూత:
ఈ ఏడాది ఓటీటీలో దుమ్మురేపేసిన టాప్ వెబ్ సిరీస్ లలో “ధూత” నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. అక్కినేని నాగచైతన్య ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రధానంగా తెలుగులో రూపొందిన ఈ వెబ్ సిరీస్ హిందీ సహ అనేక భాషల్లోనూ స్ట్రీమింగ్ అయి, మంచి ఆదరణను దక్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1న “ధూత” సీజన్ వన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా రెండు వారాలకు పైగా ట్రెండింగ్ లో నిలవడం విశేషం. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన “ధూత” న్యూస్ పేపర్లో చుట్టూ సాగే సస్పెన్స్ సిరీస్. దెయ్యం లేకపోయినప్పటికీ ఈ సూపర్ నేచురల్ హారర్ మిస్టరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కుమారి శ్రీమతి:
టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన “కుమారి శ్రీమతి”కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గోమతేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ అచ్చ తెలుగు వెబ్ సిరీస్ జీవితంలో పైకి ఎదగడానికి కష్టపడే అమ్మాయి లైఫ్ గురించి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన “కుమారి శ్రీమతి” వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
దయా:
దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో, ఈషా రెబ్బ, రమ్య నంబిషన్, విష్ణు ప్రియ కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ “దయా”. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బెంగాలీ సిలీస్ తక్ధీర్ కథ ఆధారంగా రూపొందింది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగడంతో రెండో సీజన్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
సైతాన్:
రిషి, నితిన్ ప్రసన్న, షెల్లీ రవి కాలే ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “సైతాన్”. యాత్ర ఫ్రేమ్ మహి వీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమై మంచి పాపులారిటీ దక్కించుకుంది.
ఏటీఎం;
బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ, రవి రాజ్, కృష్ణ బూర్గుల ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ “ఏటీఎం” జీ5లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శ్రీ చంద్రమోహన్ రూపొందించిన ఈ సిరీస్ జూన్ లో స్ట్రీమింగ్ అయింది.
ఇక వీటితో పాటు ఈ ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన సిరీస్ లలో మ్యాన్షన్ 24, అతిధి, సేవ్ టైగర్స్, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన వ్యూహం, జి5 లో వచ్చిన పులి మేక, వ్యవస్థ, మాయాబజార్ ఫర్ సేల్ వంటి వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ దక్కింది.
For More Updates:
Check out Filmify for the latest Tollywood Movies news, movie reviews in telugu, and all the Entertainment News in Bollywood and Celebrity News & Gossip from all Film Industries.
https://www.telugu.filmify.in/
https://www.telugu.filmify.in/gossips
Add Comment
Entertainment Articles
1. Cricket Id: The New Gateway To India’s Digital Cricket RevolutionAuthor: Topcricketid
2. Azure Devops Course In Hyderabad | Azure Devops Training
Author: visualpath
3. Paul Feller’s Civic Mindset
Author: paul feller
4. Hotel Iptv In Saudi Arabia: Redefining Digital Guest Experiences
Author: blogrme
5. Paul Feller’s Reputation As A Gentleman
Author: paul feller
6. Guide To Pick A Birthday Party Venue For Kids
Author: Coco's Funhouse
7. How To Add Animated Twitch Overlays In Obs Studio (step-by-step Guide) | Greaytoverlays
Author: AliQaiser SEO expert
8. Join Generative Ai Training | Genai Course In Hyderabad
Author: Pravin
9. From Attendance To Roi: How Trackhr Streamlines Employee Performance
Author: TrackHr App
10. Reimagining Corporate Events With The Power Of Magical Storytelling
Author: TK JIANG
11. How To Choose The Best Beach Resorts In Chennai
Author: prasanth
12. What Are Sprunki Characters? A Complete Guide For Fans
Author: ethancole53
13. From Tourists To Theatre Lovers: Why Les Misérables London Tickets Are In High Demand
Author: London West End Theatre
14. A Guide To Discovering Theaters In Chennai
Author: prasanth
15. Why Parents Choose Summer Dance Classes For Kids In Hyderabad?
Author: Steps Dance






