ALL >> Sports >> View Article
కోహ్లి సెంచరీ.. బెంగళూరు గ్రాండ్ విక్టరీ.. క్లాసెన్ శతకం వృథా.

కోహ్లి సెంచరీ.. బెంగళూరు గ్రాండ్ విక్టరీ.. క్లాసెన్ శతకం వృథా..
IPL Match Today(RCB vs SRH): ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. విరాట్ కోహ్లి అద్బుత సెంచరీ, కెప్టెన్ డుప్లెసిస్ సూపర్ ఇన్నింగ్స్ తో కదంతొక్కారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. క్లాసెన్ సెంచరీ వృథా అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల ...
... నష్టానికి 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (11) , రాహుల్ త్రిపాఠి (15), మార్ క్రమ్ (18) విఫలమైనా ఒకవైపు క్లాసెన్ (104, 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో అదరగొట్టాడు. హ్యారీ బ్రూక్ (27) చివరిలో మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది.
బెంగళూరు బౌలర్లలో బ్రాస్ వెల్ రెండు వికెట్లు, సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. ముఖ్యంగా సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అందువల్లే హైదరాబాద్ స్కోర్ 200 దాటలేదు.
లక్ష్యఛేదనలో బెంగళూరు ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్ చెలరేగి ఆడారు. కోహ్లి (100, 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు. ఈ జోడి తొలి వికెట్ కు 172 పరుగులు జోడించింది. కోహ్లి అవుటైన వెంటనే డుప్లెసిస్ ( 71, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) కూడా అవుటయ్యాడు. మాక్స్ వెల్ (5 నాటౌట్), మైఖేల్ బ్రాస్ వెల్ (4 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో 19.2 ఓవర్లలోనే బెంగళూరు విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తలోవికెట్ తీశారు. అద్భుత సెంచరీతో చెలరేగిన ఛేజ్ మాస్టర్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
New Parliament Building(Telugu news updates) : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పేరుతో ఈ భవన నిర్మాణం చేపట్టారు.
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధానిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని లోక్సభ సచివాలయం ప్రకటించింది. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్లో 888 మంది, రాజ్యసభ ఛాంబర్లో 300 మంది కూర్చునే వీలుంది. పార్లమెంట్ సంయుక్త సమావేశం జరిగితే లోక్సభ ఛాంబర్లోనే 1280 మంది సభ్యులు కూర్చోవచ్చని తెలిపింది.
2020 డిసెంబర్ 10న పార్లమెంట్ కొత్త భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని 1927లో నిర్మించారు. ఈ భవనం నిర్మించి 96 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ కు కొత్త భవనాన్ని నిర్మించాలని మోదీ సర్కార్ సంకల్పించింది. భారత ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేలా భారత సంస్కృతి చిహ్నాలతో నిర్మాణం చేపట్టారు.
For More Updates:
BIG TV Presents the latest news in Telugu, and updates on Business, Sports, Games, Politics, Technology, Education, and Entertainment. BIG TV Presents the latest Telangana news updates and Andhra Pradesh Breaking News, Live updates on Politics, Technology, Education & Business, etc. Watch More on BIG TV. Visit: https://bigtvlive.com/
https://bigtvlive.com/telangana
Add Comment
Sports Articles
1. Nfl Games: O’connell Backs Mccarthy Over RodgersAuthor: eticketing.co
2. British And Irish Lions: Jorgensen Eyes Lions Return
Author: eticketing.co
3. Unveiling The Best Badminton Shuttlecocks To Improve Your Game
Author: Jeremy Hughes
4. Nfl Games: Andy Reid’s Supreme Legacy As The Nfl’s Top Coach
Author: eticketing.co
5. Nfl Games: Chiefs Add Experience With Smith-schuster Return
Author: eticketing.co
6. Nfl Games: High Hopes For Mccarthy In Minnesota
Author: eticketing.co
7. British And Irish Lions: Farrell Confident On Fitness Front
Author: eticketing.co
8. Nfl 2025: Chiefs Wrap Up Offseason With Mandatory Minicamp
Author: eticketing.co
9. British And Irish Lions: Skelton Poised For Lions Redemption
Author: eticketing.co
10. Nfl Games 2025: Kelce Commits To Year 13 With Chiefs
Author: eticketing.co
11. Nfl Games: Mccarthy Era Begins In Minnesota
Author: eticketing.co
12. British And Irish Lions: Captain Itoje Era Begins
Author: eticketing.co
13. Nfl Games: Chargers Quietly Gearing Up For Another Leap
Author: eticketing.co
14. British Irish Lions: Reds Players Eye Wallabies Gold
Author: eticketing.co
15. British And Irish Lions: Argentina Prepare For Historic Lions Clash
Author: eticketing.co